Rajinikanth's Coolie : కూలీ .. పెద్దలకు మాత్రమే

Rajinikanths Coolie :  కూలీ .. పెద్దలకు మాత్రమే
X

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన సినిమా కూలీ. అక్కినేని నాగార్జున విలన్ గా కనిపించబోతున్నాడీ సినిమాలో. ఆగస్ట్ 14న విడుదల కాబోతోన్న కూలీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇతర కీలక పాత్రల్లో ఉపేంద్ర, సౌబిర్ షబిన్, శృతి హాసన్, గెస్ట్ పాత్రలో ఆమిర్ ఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నాడు లోకేష్ కనకరాజ్. మరికొన్ని గంటల్లో ట్రైలర్ కూడా రాబోతోంది. ట్రైలర్ తర్వాత మూవీ రేంజ్ మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ ధరలకే అమ్ముడైపోయిందీ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో 45 కోట్లకు కొన్నారు.

ఇక తాజాగా ఈ మూవీ సెన్సార్ అయిపోయింది. సెన్సార్ నుంచి కూలీకి ‘ఏ’సర్టిఫికెట్ వచ్చింది. అంటే కూలీ పెద్దలకు మాత్రమే పరిమితం అన్నమాట. మామూలుగానే లోకేష్ మూవీలో వయొలెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఏ సర్టిఫికెట్ కు ఆ వయొలెన్సే ఓ కారణం అనుకోవచ్చు. సినిమా పరిస్థితి ఎలా ఉన్నా.. నాగార్జున విలనీ కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆయన కూలీలో స్టైలిష్ విలన్ గా కనిపించబోతున్నాడని లోకేష్ ముందు నుంచీ చెబుతూ వస్తున్నాడు. సో.. ఈ కంటెంట్ ఎలా ఉండబోతోందో చూడాలి.

Tags

Next Story