RBI Assistant Recruitment 2022: డిగ్రీ అర్హతతో RBIలో ఉద్యోగాలు.. జీతం రూ.36,091

RBI Assistant Recruitment 2022: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 17 ఫిబ్రవరి, 2022 నుండి అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం తన ఆన్‌లైన్ అప్లికేషన్ విండోను ఓపెన్ చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు rbi.org.in వద్ద అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేయడానికి దశలు
RBI పోర్టల్‌లో మీ పేరును నమోదు చేసుకోండి
దరఖాస్తు ఫారమ్‌ను పూరించి అందులో సూచించిన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయండి
దరఖాస్తు రుసుమును చెల్లించి, అప్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేయండి
ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్తు అవసరాల కోసం కాపీని భద్రపరుచుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులను మాత్రమే స్వీకరిస్తుంది. ఏ ఇతర మాధ్యమాల ద్వారా దరఖాస్తులు అంగీకరింపబడవు.
ఎంపిక ప్రక్రియ
RBI దేశవ్యాప్తంగా రెండు దశల పోటీ పరీక్షల ద్వారా అసిస్టెంట్ పోస్టుల కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది - ప్రిలిమినరీ మరియు మెయిన్ ఎగ్జామినేషన్ తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (LPT).
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఖాళీలకు సంబంధించిన పూర్తి ప్రకటన ఫిబ్రవరి 2022 మూడవ వారంలో RBI అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. అ
RBI అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2022 : ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ - 17 ఫిబ్రవరి, 2022న ప్రారంభమవుతుంది
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ - మార్చి 8, 2022
అర్హత పరీక్ష - 26 మరియు 27 మార్చి, 2022 న జరుగుతుంది
జీతం: బేసిక్ పే నెలకు రూ. 14,650/-. జీతం నెలకు రూ. 36,091/-.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌తో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థలో మొత్తం 950 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకు కార్యాలయాల్లో నియమింపబడతారు.
రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు రుసుమును చెల్లించాలి. దరఖాస్తు రుసుము లేకుండా నమోదు పూర్తయినట్లు పరిగణించబడదు.
మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు RBI అధికారిక వెబ్‌సైట్ - rbi.org.in ని సందర్శించాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com