RRC Recruitment 2021: టెన్త్ అర్హతతో వెస్ట్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు..

RRC Recruitment 2021: భారతీయ రైల్వే వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది. రైల్వేకు చెందిన వేర్వేరు జోన్ల ఖాళీలను భర్తీ చేసేందుకు సంస్థ జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది. వెస్ట్ సెంట్రల్ రైల్వే కూడా భారీగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 2226 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 10 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.
ఖాళీల వివరాలు..
డీజిల్ మెకానిక్ - 77
ఎలక్ట్రీషియన్ - 478
వెల్డర్ - 147
మెషినిస్ట్ - 37
ఫిట్టర్ - 491
టర్నర్ - 12
వైర్‌మ్యాన్ - 67
మేసన్ - 86
కార్పెంటర్ - 60
పెయింటర్ - 165
గార్డెనర్ - 4
ఫ్లోరిస్ట్ అండ్ ల్యాండ్ స్కేపింగ్ - 4
పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ - 20
హార్టికల్చర్ అసిస్టెంట్ - 5
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 60
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటినెన్స్ - 5
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ - 155
స్టెనోగ్రాఫర్ (హిందీ) - 28
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) - 23
అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్ (జనరల్) - 2
అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్ (వెజిటేరియన్)- 2
అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్ (కుకింగ్) - 5
హోటల్ క్లర్క్/రిసిప్షనిస్ట్ - 1
డిజిటల్ ఫోటోగ్రాఫర్ - 1
అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ - 1
కంప్యూటర్ నెట్‌వర్కింగ్ టెక్నీషియన్ - 4
క్రెచ్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ - 1
సెక్రటేరియల్ అసిస్టెంట్ - 4
హౌస్ కీపర్ - 7
హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ - 2
డెంటల్ లేబరేటరీ టెక్నీషియన్ - 2
మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్‌మెంట్ మెకానిక్ కమ్ ఆపరేటర్ - 5
ఏసీ మెకానిక్ - 9
బ్లాక్‌స్మిత్ - 74
కేబుల్ జాయింటర్ - 3
డ్రాప్ట్స్‌మ్యాన్ (మెకానికల్) - 1
డ్రాప్ట్స్‌మ్యాన్ (సివిల్) - 14
సర్వేయర్ - 9
ప్లంబర్ - 66
స్యూయింగ్ టెక్నాలజీ - 5
ఇండస్ట్రియల్ పెయింటర్ - 5
మెకానిక్ (మోటార్ వెహికల్) - 4
మెకానిక్ (ట్రాక్టర్) - 4
ముఖ్యాంశాలు..
దరఖాస్తు ప్రారంభం: 2021 అక్టోబర్ 11.
దరఖాస్తుకు చివరి తేదీ: 2021 నవంబర్ 10
విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెన్త్ క్లాస్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
వయసు: 24 ఏళ్లకు మించకూడదు
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.100 ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్ధులు, మహిళలకు ఫీజు లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com