SBI Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఎస్బీఐలో ఉద్యోగాలు.. జీతం రూ.36 వేల నుంచి రూ.63840 వరకు

SBI Recruitment 2022: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ పోస్టుల భర్తీకిగాను నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా, స్పెషలిస్ట్ క్యాడర్‌లో అసిస్టెంట్ మేనేజర్ కోసం మొత్తం 48 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ ఫిబ్రవరి 5, 2022 నుండి SBI అధికారిక వెబ్‌సైట్- sbi.co.in లో అందుబాటులో ఉంది.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 5, 2022
ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2022
ఖాళీ వివరాలు
అసిస్టెంట్ మేనేజర్ (నెట్‌వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్): 15 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ (రూటింగ్ & స్విచింగ్): 33 పోస్టులు
అర్హత..
అసిస్టెంట్ మేనేజర్ (నెట్‌వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్) (JMGS-I) : ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ (రూటింగ్ & స్విచింగ్) (JMGS-I) : ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కనీసం 60% మార్కులు వచ్చి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ మరియు దరఖాస్తు రుసుము
ఎంపిక ఆన్‌లైన్ రాత పరీక్షలు మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది. రాత పరీక్ష 100 మార్కులకు 120 నిమిషాలకు 80 ప్రశ్నలకు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఆన్‌లైన్ వ్రాత పరీక్ష మార్చి 20, 2022న నిర్వహించబడుతుంది. జనరల్, OBC, EWS వర్గాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 750 చెల్లించాలి. ఇదిలా ఉండగా, SC, ST, Pwd వర్గాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించనవసరం లేదు.
వయో పరిమితి
గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు.
వేతనం: ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.36 వేల నుంచి రూ.63840 వరకు వేతనం ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు.
ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు పై పోస్టులకు ఫిబ్రవరి 25, 2022లోపు అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com