Bank of India Recruitment 2022: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..

Bank of India Recruitment 2022: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..
Bank of India Recruitment 2022: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్ధులు అప్లై చేసుకోవచ్చు.

Bank of India Recruitment 2022: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేష్ విడుదలైంది.. మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో అప్లే చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జనవరి 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అప్లై చేసుకోవచ్చు.

అర్హత:

గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్ధులు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కనీసం మూడు నెలల సర్టిఫికేషన్ కోర్సు చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. కనీసం ఐదేళ్ల పాటు ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలు వయోపరిమితిగా 40 ఏళ్లను నిర్ణయించారు. అభ్యర్ధులు నవంబర్ 1 నాటికి 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య తప్పనిసరిగా ఉండాలి.

అభ్యర్థుల ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

అప్లై చేసే విధానం..

1. అభ్యర్ధులు మొదట బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://bankofindia.co.in/ను ఓపెన్ చేయాలి.

2. అనంతరం కెరీర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

3. Recruitment of Specialist Security Officers అనే లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

4. తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో click for apply online అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

5. అక్కడ కొత్త పేజీ కనిపిస్తుంది. అక్కడ click here for new registration ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లికే చేయాలి.

6. అక్కడ పేరు, మొబైల్ నెంబర్ తదితర వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. దీంతో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.

7. అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.

8. అప్లికేషన్‌ ఫామ్‌ని ప్రింట్ అవుట్ తీసుకుని భద్రపరచుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story