South Central Railway Recruitment 2021: పదోతరగతి అర్హతతో సికింద్రాబాద్ రైల్వేస్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు..

South Central Railway Recruitment 2021: పదోతరగతి అర్హతతో సికింద్రాబాద్ రైల్వేస్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు..
South Central Railway Recruitment 2021: సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

South Central Railway Recruitment 2021: సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 4,103 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

మొత్తం 4,103 ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు 10 వ తరగతి పరీక్ష లేదా దానికి సమానమైన (10+2 పరీక్షా విధానంలో) కనీసం 50 శాతం మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుండి ఉత్తీర్ణులై ఉండాలి మరియు NCVT/ SCVT ద్వారా గుర్తింపు పొందిన సంస్థల నుండి ప్రకటించబడిన ట్రేడ్‌లో ITI సర్టిఫికెట్ కూడా కలిగి ఉండాలి. అభ్యర్థి వయోపరిమితి 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

అప్లికేషన్ ఫీజు

అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ. 100/- చెల్లించాలి. ఆన్‌లైన్ చెల్లింపు కోసం లావాదేవీ ఛార్జీలు, ఏదైనా ఉంటే, అభ్యర్థి భరించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజులను నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్, SBI UPI ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. SC/ST మరియు మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

ఆసక్తి, అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు నవంబర్ 3వ తేదీ. పూర్తి వివరాలకు https://scr.indianrailways.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.

విభాగాల వారీగా ఖాళీలు..

ఏసీ మెకానిక్ - 250

కార్పెంటర్ - 18

డీజిల్ మెకానిక్ - 531

ఎలక్ట్రీషియన్ - 1019

ఎలక్ట్రానిక్ మెకానిక్ - 92

ఫిట్టర్ - 1460

మెషినిస్ట్ - 71

ఎంఎంటీఎం - 5

ఎంఎండబ్ల్యూ - 24

పెయింటర్ - 80

వెల్డర్ - 553

Tags

Read MoreRead Less
Next Story