south central railway recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలు.. జీతం రూ. 20,200
South Central Railway Recruitment 2022: సౌత్ వెస్ట్రన్ రైల్వే రిక్రూట్‌మెంట్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకిగాను నోటిఫికేషన్‌విడుదల చేసింది. మొత్తం 21 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు 20 మార్చి 2022లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 18 నుండి 25 సంవత్సరాలు ఉండాలి. అప్రెంటిస్ కోసం, అభ్యర్థుల విద్యార్హత ఏదైనా డిగ్రీ/12వ/10వ తరగతి/ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ముఖ్యమైన వివరాలు:
మొత్తం ఖాళీలు 21
అర్హత ఏదైనా డిగ్రీ/12వ/10వ/ఐటీఐ
అనుభవం ఫ్రెషర్స్
జీతం రూ. 5,200-20,200/నెలకు
ఉద్యోగ ప్రదేశం హుబ్లీ
దరఖాస్తుకు చివరి తేదీ 20 మార్చి 2022
అర్హతలు:
స్థాయి-5:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానం.
స్థాయి-4:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానం.
స్థాయి-3/2:
నాన్-టెక్నికల్ పోస్టులకు 12వ (+2 స్టేజ్) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత. తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ వ్యవధి ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉంటుంది.
గుర్తింపు పొందిన సంస్థ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉంటే, మూడు సంవత్సరాల పాటు శిక్షణ కోసం ఎంపిక చేయబడతారు.
వయోపరిమితి (01.01.2022 నాటికి):
18 నుండి 25 సంవత్సరాలు
పోస్ట్ వైజ్ ఖాళీలు:
క్రికెట్ - 05 పోస్టులు
అథ్లెటిక్స్ - 01 పోస్ట్
బాస్కెట్‌బాల్ - 01 పోస్ట్
బ్యాడ్మింటన్ - 01 పోస్ట్
చెస్ - 01 పోస్ట్
క్రికెట్ – 03 పోస్టులు
పవర్ లిఫ్టింగ్ - 01 పోస్ట్
వెయిట్ లిఫ్టింగ్ - 01 పోస్ట్
టేబుల్ సర్వీస్ - 01 పోస్ట్
హాకీ – 04 పోస్టులు
స్విమ్మింగ్ - 01 పోస్ట్
గోల్ఫ్ - 01 పోస్ట్
ఈ రిక్రూట్‌మెంట్ కోసం, అర్హత ఉన్న అభ్యర్థులందరినీ ట్రయల్స్ కోసం పిలుస్తారు. అభ్యర్థులు దీనికి సంబంధించిన సమాచారం కోసం వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు.
విద్యార్హత, కులం, క్రీడా విజయాలు, పుట్టిన తేదీ, మైనారిటీ ఆదాయ ధృవీకరణ పత్రం, వంటి డాక్యుమెంట్స్ అన్నీ ఆన్‌లైన్ అప్లికేషన్ నింపేటప్పుడు అప్‌లోడ్ చేసేటప్పుడు సమర్పించాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలకోసం సౌత్ వెస్ట్రన్ రైల్వే వెబ్‌సైట్ wear rtchubli.in చూడవచ్చు.
దరఖాస్తు రుసుము:
జనరల్ అభ్యర్థులకు: రూ.500/-
SC / ST / PWD / మాజీ సైనికులు / మహిళలు / మైనారిటీలు / ఆర్థిక వెనుకబడిన తరగతులకు: రూ.250/-
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com