SSC Recruitment 2023: టెన్త్ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఉద్యోగాలు..

SSC Recruitment 2023: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మల్టీ-టాస్కింగ్ సర్వీసెస్ (MTS) మరియు హవల్దార్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్-- ssc.nic.in ద్వారా చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 17. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 11,409 పోస్టులను భర్తీ చేయనుంది.
అర్హత
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుండి 10వ తరగతి లేదా తత్సమాన అర్హత పొంది ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 నుండి 25 సంవత్సరాల వయస్సులోపు ఉండాలి. గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT/CBE)కి హాజరు కావాలి.
అర్హత సాధించినట్లయితే, వారు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)కి హాజరు కావాలి, ఇది హవల్దార్ పోస్టులకు మాత్రమే వర్తిస్తుంది.
చివరగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్.
దరఖాస్తు ఫీజు
పరీక్షకు హాజరు కావడానికి అభ్యర్ధులు రూ. 100 దరఖాస్తు రుసుమును చెల్లించాలి. SC/ST/ESM/PwBd వర్గాలకు చెందిన వారు దరఖాస్తు రుసుము చెల్లించకుండా మినహాయించబడ్డారు.
ఎలా దరఖాస్తు చేయాలి
అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి-- ssc.nic.in
SSC నోటిఫికేషన్‌పై క్లిక్ చేసి, అన్ని వివరాలను చూడండి
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
భవిష్యత్ అవసరాల దృష్ట్యా దరఖాస్తు ప్రింటవుట్ తీసి ఉంచుకోవాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com