Jobs in TCS: బీటెక్, ఎంటెక్ అర్హతతో టీసీఎస్‌లో ఉద్యోగాలు.. ఏడాదికి జీతం రూ.7,30,000

Jobs in TCS: ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) డిజిటల్ హైరింగ్ కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఆసక్తిగల అభ్యర్ధులు 2022 ఫిబ్రవరి 25లోగా అప్లై చేసుకోవాలి. ఇప్పటికే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు హాజరైన అభ్యర్ధులు అప్పుడు జారీ చేసిన CT/DT ఐడీతో తాజా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కనీసం 6 నుంచి 12 నెలల ఐటీ వర్క్ ఎక్స్‌పీరెయన్స్ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య విషయాలు..
బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 2019, 20, 21 సంవత్సరాల్లో పాస్ అయిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్
వేతనం: అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారికి ఏడాదికి రూ.7,00,000. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారికి ఏడాదికి రూ.7,30,000
దరఖాస్తు విధానం
* అభ్యర్థులు TCS NextStep portal ఓపెన్ చేయాలి.
* హోమ్ పేజీలో Register Now పైన క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత IT పైన క్లిక్ చేయాలి
* అభ్యర్థి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి
* వివరాలు సరిచూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి
* అప్లికేషన్ స్టేటస్‌లో Application Received అని ఉండాలి
* ఆ తర్వాత CT/DT ఐడీతో రెండో స్టెప్ దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.
* https://ww.tcs.com/careers/tcs-digital-hiring వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Apple Here with CT/DT ID పైన క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
ఒక అభ్యర్థి ఒక దరఖాస్తు మాత్రమే సబ్మిట్ చేయాలి. ఒకటి కన్నా ఎక్కువ అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తే సదరు అభ్యర్థిని అనర్హులుగా పరిగణిస్తారు. అభ్యర్ధులు తప్పనిసరిగా రెండు దశల్లో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. సెలెక్షన్ ప్రాసెస్ సమయంలో అభ్యర్దులు విద్యార్హతల సర్టిఫికెట్స్‌తో పాటు ఎంప్లాయ్‌మెంట్ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. టెస్టుకు సంబంధించిన సమాచారాన్ని TCS iON అందిస్తుంది.
++++++++++++++++++++++++
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com