Software Jobs: డిగ్రీ అర్హతతో ప్రముఖ సాప్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు..

Software Jobs: డిగ్రీ అర్హతతో ప్రముఖ సాప్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు..
Software Jobs: ప్రముఖ సాప్ట్‌వేర్ సంస్థలు నైపుణ్యం ఉన్న అభ్యర్థుల కోసం వెతుకుతున్నాయి. ఈ క్రమంలోనే జెన్‌పాక్ట్, టీసీఎస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

Software Jobs: ప్రముఖ సాప్ట్‌వేర్ సంస్థలు నైపుణ్యం ఉన్న అభ్యర్థుల కోసం వెతుకుతున్నాయి. ఈ క్రమంలోనే జెన్‌పాక్ట్, టీసీఎస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ కంపెనీ హైదరాబాద్ బ్రాంచ్‌లో ఉన్న ప్రాసెస్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది.



ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ కంపెనీ హైదరాబాద్ బ్రాంచ్‌లో ఉన్న ప్రాసెస్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌లో మంచి పట్టు ఉండాలి.



మాట్లాడడంతో పాటు రాయడంలోనూ మంచి నైపుణ్యం ఉండాలి. కొన్ని సందర్భాల్లో వీకెండ్స్ కూడా పని చేయాల్సి ఉంటుంది. కస్టమర్ హ్యాండ్లింగ్, కొత్త విషయాలను నేర్చుకునే ఉత్సాహం ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.



మరో సాప్ట్‌వేర్ కంపెనీ టీసీఎస్ బీపీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2022 ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. బీకామ్/బీఏ/బీఏఎఫ్/బీబీఐ/బీబీఏ/బీఎంఎస్/బీఎస్సీ/బీసీఏ/బీసీఎస్/బీఫార్మసీ/ఎంఫార్మసీ అభ్యర్ధులు అర్హులు. అభ్యర్థులు నిర్ణీత వ్యవధిలో కోర్సు పూర్తి చేసి ఉండాలి. పార్ట్‌ టైమ్ /కరస్పాన్‌డెన్స్ కోర్సులు చేసిన వారు అనర్హులు.


అభ్యర్ధుల వయసు కనీసం 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పరీక్ష విధానం: పరీక్ష వ్యవధి 65 నిమిషాలు ఉంటుంది. ఇందులో మొత్తం 80 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి

Tags

Read MoreRead Less
Next Story