Telangana Gramin Dak Sevak Posts:'టెన్త్' అర్హతతో పోస్టాఫీస్‌లో ఉద్యోగం.. 1150 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Telangana Gramin Dak Sevak Posts
Telangana Gramin Dak Sevak Posts: భారత ప్రభుత్వ పోస్టల్ విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని తెలంగాణ సర్కిల్‌కి చెందిన చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం.. 1150 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు, దరఖాస్తుకు https://appost.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 1150
1. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం)
2. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం)
3. డాక్ సేవక్
ముఖ్య సమాచారం:
అర్హత: మ్యాథమేటిక్స్, లోకల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో పదవ తరగతి ఉత్తీర్ణత. 60 రోజుల శిక్షణా వ్యవధితో ఏదైనా కంప్యూటర్ ట్రయినింగ్ ఇనిస్టిట్యూట్ నుంచి బేసిక్ కంప్యూటర్ ట్రెయినింగ్ కోర్సు సర్టిఫికెట్ ఉండాలి. కంప్యూటర్‌ను ఒక సబ్జెక్టుగా పదవతరగతిలో చదివి వుంటే సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం ఉండదు. సంబంధిత గ్రామ పరిధిలో నివాసం ఉండాలి.
వయసు: 27.01.2021 నాటికి 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా నిబంధనల ప్రకారం ఆటోమేటిక్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ తయారవుతుంది. ఉన్నత విద్యార్హతలు ఉన్నా దాన్ని పరిగణనలోకి తీసుకోరు. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ పురుష/ట్రాన్స్-మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. మహిళా/ట్రాన్స్-విమెన్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 27,2021
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 26, 2021
వెబ్‌సైట్: https://appost.in/
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు https://appost.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో మొదటి స్టేజ్ కోసం Registration పైన క్లిక్ చేయాలి.
పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది.
రెండో స్టేజ్‌లో ఫీజ్ పేమెంట్ చేయాలి. ఆన్‌లైన్‌లో పేమెంట్ చేస్తే సెటిల్మెంట్ కోసం 72 గంటల సమయం పట్టొచ్చు.
ఆఫ్‌లైన్‌లో పోస్ట్ ఆఫీస్‌లో పేమెంట్ చేయాలి. పేమెంట్ స్వీకరించే పోస్ట్ ఆఫీస్ జాబితా https://appost.in/ వెబ్‌సైట్‌లో ఉంటుంది.
పేమెంట్ తర్వాత మూడో స్టేజ్ దరఖాస్తు ఉంటుంది.
అందులో మొదటి స్టెప్‌లో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి. రెండో స్టెప్‌లో డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. మూడో స్టెప్‌లో పోస్ట్ ఎంచుకోవాలి. అన్నీ పూర్తయిన తరువాత సబ్మిట్ కొట్టాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com