జమునా హ్యాచరీస్‌ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

జమునా హ్యాచరీస్‌ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
జమునా హ్యాచరీస్‌ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మే1, 2న అధికారులు చేసిన విచారణను పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వానికి తెలిపింది.

జమునా హ్యాచరీస్‌ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మే1, 2న అధికారులు చేసిన విచారణను పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వానికి తెలిపింది. సరైన పద్దతిలో నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలని పేర్కొంది. శుక్రవారం ఇచ్చి సోమవారం రిప్లై ఇవ్వమనేలా ఉండకూడదని తెలిపింది. రాజమార్గంలో వెళ్లాలి కానీ.. వెనక గేట్‌ నుంచి కాదని స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారి చేసింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 6కు వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story