తెలంగాణ గురుకులాల్లో లైబ్రేరియన్‌ పోస్టులకు నోటిఫికేషన్.. జీతం రూ.39,890-1,12,510

తెలంగాణ గురుకులాల్లో లైబ్రేరియన్‌ పోస్టులకు నోటిఫికేషన్.. జీతం రూ.39,890-1,12,510
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ- రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) తెలంగాణ సాంఘీక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో డైరెక్ట్ ప్రాతిపదికన లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య : 434

సొసైటీల వారీగా ఖాళీలు

తెలంగాణ సాఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలు: 54

మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు: 180

తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు: 200

అర్హత: డిగ్రీతో పాటు లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ.39,890 నుంచి రూ.1,12,510 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష(పేపర్‌–1, పేపర్‌–2), సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.05.2023

వెబ్‌సైట్‌: https://treirb.telangana.gov.in/

Tags

Read MoreRead Less
Next Story