తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది కరోనా ప్రభావం ఉన్నా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించామన్నారు మంత్రి సబితా. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 89,743 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు.. పరీక్షకు మొత్తం 1,43,326 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,19,183 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు.
ఈ ఏడాది టాప్ పది ర్యాంకులను సాధించిన వారు అబ్బాయిలే కావడం విశేషం. సాయితేజ వారణాసి తొలి ర్యాంకు సాధించగా.. యశ్వంత్ సాయి రెండు, మణి వెంకట కృష్ణ మూడో ర్యాంక్ సొంతం చేసుకున్నాడు.
Also Read:లింక్ 1 : తెలంగాణ ఎంసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
Also Read:లింక్ 2 : తెలంగాణ ఎంసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com