TS Police Recruitment 2022 Notification: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మొత్తం 16వేల 614 పోస్టులు..

TS Police Recruitment 2022 Notification: ఉద్యోగాల భర్తీ దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఒక్కొక్కటిగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. తాజాగా పోలీస్ నియామకాలకు సంబంధించి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 16వేల 614 పోలీస్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఇందులో 587 ఎస్సై పోస్టులు కాగా, 16వేల 027 కానిస్టేబుల్ పోస్టులు.
ఎస్సై సివిల్ 414, ఏఆర్ ఎస్సై 66 పోస్టులు ఉన్నాయి. ఇక సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 4వేల 965, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు 4వేల 423, టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్ కానిస్టేబుల్స్ పోస్టులు 5వేల 10, స్పెషల్ పోలీస్ ఫోర్స్ పోస్టులు 390, ఫైర్ పోస్టులు 610, డ్రైవర్లు 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. మే 2నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు చేసుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com