TSNPDCL Recruitment 2023: విద్యుత్ శాఖలో ఉద్యోగాలు.. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

TSNPDCL Recruitment 2023: వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో ఖాళీగా ఉన్న 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యుత్ సర్కిళ్లు: వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్.
అర్హత: బీఏ, బీఎస్సీ, బీకాంతోపాటు కంప్యూటర్ అప్లికేషన్/ఆఫీస్ ఆటోమేషన్ (ఎంఎస్ ఆఫీస్) సర్టిఫికేట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.01.2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.29,255 నుంచి రూ.54,380 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష (80 మార్కులు), సంబంధిత అనుభవం (20 మార్కులు), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: 29.04.2023.
హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్ ప్రారంభతేదీ: 22.05.2023
రాతపరీక్ష తేదీ: 28.05.2023
వెబ్‌సైట్: https://tsnpdcl.in/
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com