TSPSC Group 4 Recruitment: గుడ్‌న్యూస్.. గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్..

TSPSC Group 4 Recruitment: గుడ్‌న్యూస్.. గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్..
TSPSC Group 4 Recruitment: రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మొత్తం 9168 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

TSPSC Group 4 Recruitment: రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మొత్తం 9168 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 25 ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డ్ ఆఫీసర్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి.

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గ్రూప్ 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో మొత్తం 9168 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 25 ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డ్ ఆఫీసర్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి.

శాఖల వారీగా చూస్తే పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో 2,701, రెవెన్యూ శాఖలో 2077, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 1245, వ్యవసాయం, సహకార శాఖలో 44, పశుసంవర్ధక శాఖలో 2, డెయిరీ డెవలప్‌మెంట్ శాఖ, బీసీ సంక్షేమ శాఖలో 307, రెవెన్యూ శాఖలో 24, ఎస్సీ సంక్షేమ శాఖలో 7 పోస్టులు. నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే కార్మిక శాఖలో 128, గిరిజన సంక్షేమంలో 221, హోంశాఖలో 133, పాఠశాల విద్యాశాఖలో 97 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ పోస్టులకు అభ్యర్థులు ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష మే 2023లో నిర్వహించబడుతుంది. పూర్తి వివరాల కోసం https://www.tspsc.gov.inని సందర్శించవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story