TTD Recruitment 2022: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు..

TTD Recruitment 2022: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు..
TTD Recruitment 2022: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పలు ఖాళీల భర్తీకి దరఖాస్తు్ల్ని స్వీకరిస్తోంది.

TTD Recruitment 2022: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్‌వీ ప్రాణదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న హార్ట్ సెంటర్ ఇది. ఇందులో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది టీటీడీ, ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్ధులు 2022 జనవరి 20లోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాలి. అప్లికేషన్స్ పోస్టులో పంపాల్సి ఉంటుంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు.. 8 ఉండగా అందులో పీడియాట్రిక్ అసోసియేట్ థొరాసిక్ సర్జన్ పోస్టు 1 ఉంది. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎంసీహెచ్ ఇన్ కార్డియో థొరాసిక్ సర్జరీ లేదా డీఎన్ సీటీవీఎస్ పీజీ డిగ్రీ పాస్ కావాలి. పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి. వేతనం రూ.209200 + అలవెన్సులు లభిస్తాయి.

అసిస్టెంట్ పీడియాట్రీషియన్ పోస్టు: 1. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎండీ పీడియాట్రిక్స్, డీఎన్‌బీ పీజీ డిగ్రీ పాస్ కావాలి. మూడేళ్ల అనుభవం తప్పనిసరి. రూ.93800 + అలవెన్సులు లభిస్తాయి.

పీడియాట్రిక్ అసోసియేట్ సీటీ సర్జన్ పోస్టు : 1. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎంసీహెచ్ ఇన్ కార్డియో థొరాసిక్ సర్జరీ లేదా డీఎన్‌బీ సీటీవీఎస్ పీజీ డిగ్రీ పాస్ కావాలి. పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీలో ఏడాది అనుభవం ఉండాలి. రూ.167400 + అలవెన్సులు లభిస్తాయి. అసిస్టెంట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ పోస్టులు 2 ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనిర్శిటీ నుంచి డీఎం, డీఎన్‌బీ పీడియాట్రిక్ కార్డియాలజీ పాస్ కావాలి. పీడియాట్రిక్ కార్డియాలజీలో ఏడాది అనుభవం ఉండాలి. రూ.167400 + అలవెన్సులు లభిస్తాయి.

రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ పోస్టు: 1.. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎండీ అనస్థీషియా, డీఎన్‌బీ అనస్థీషియా పీజీ డిగ్రీ పాస్ కావాలి. డీఎం కార్డియాక్ అనస్థీషియా లేదా ఫెలోషిప్ ఇన్ కార్డియాక్ అనస్థీషియా ఉండాలి. రూ.105810 + అలవెన్సులు లభిస్తాయి. అసిస్టెంట్ అనస్థీటిస్ట్ పోస్టులు 2 ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ పాస్ కావాలి. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో కనీసం ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. రూ.105810 + అలవెన్సులు లభిస్తాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్ధులు ముందుగా https://www.tirumala.org/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో నోటిఫికేషన్స్ సెక్షన్‌లోకి వెళ్లాలి. శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్‌లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయాలి. నోటిఫికేషన్‌లోనే చివర్లో దరఖాస్తు ఫామ్ ఉంటుంది. దరఖాస్తు ఫామ్ ఫ్రింట్ తీసుకొని పూర్తి చేయాలి.

అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి చివరి తేదీలోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. లేదా మెయిల్‌ చేయొచ్చు. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్.. Director, Sri Padmavathi Children's Heart Center, Near BIRRD Premises, Tirupati 517507. దరఖాస్తులు పంపాల్సిన మెయిల్ ఐడీ: spchcttd @gmail.com

Tags

Read MoreRead Less
Next Story