CBI Recruitment 2022: డిగ్రీ అర్హతతో సీబీఐలో ఉద్యోగాలు.. జీతం రూ. 40,000

CBI Recruitment 2022: డిగ్రీ అర్హతతో సీబీఐలో ఉద్యోగాలు.. జీతం రూ. 40,000
CBI Recruitment 2022: అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.

CBI Recruitment 2022: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్‌స్పెక్టర్లు ,అంతకంటే ఎక్కువ స్థాయి ఉన్న రిటైర్డ్ పోలీసు అధికారులు కూడా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ 15 ఏప్రిల్ 2022. అభ్యర్థులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తిగా చదవాలి.

అభ్యర్థులు అధికారిక CBI వెబ్‌సైట్–www.cbi.gov.in నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తుకు చివరి తేదీ – ఏప్రిల్ 15, 2022

అర్హతలు

ఇన్‌స్పెక్టర్ స్థాయి లేదా అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న సెంట్రల్/స్టేట్ పోలీస్ ఫోర్స్‌లోని రిటైర్డ్ పోలీసు అధికారులు పైన పేర్కొన్న పోస్ట్‌లకు అర్హులు.

అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.

జీతం వివరాలు

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 జీతం లభిస్తుంది.

ఎలా దరఖాస్తు చేయాలి

CBI అధికారిక సైట్‌కి వెళ్లండి–www.cbi.gov.in.

హోమ్ పేజీలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి చదవండి.

అర్హత గల అభ్యర్థులు పూరించిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు అవసరమైన పత్రాలను స్పీడ్/రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా హెడ్ ఆఫ్ జోన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కోల్‌కతా జోన్, కోల్‌కతాకు 15వ అంతస్తులో, 2వ MSO బిల్డింగ్, 234/4, AJC బోస్ రోడ్, కోల్‌కతాకు పంపించాలి. పిన్ కోడ్ - 700020.

అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు, చివరి తేదీ తర్వాత పంపించిన దరఖాస్తులు స్వీకరించబడవని నోటిఫికేషన్లో తెలియజేశారు.

Tags

Read MoreRead Less
Next Story