Vizag Steel:స్టీల్‌ప్లాంట్‌లో ఇంజినీరింగ్,డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు

Vizag Steel:స్టీల్‌ప్లాంట్‌లో ఇంజినీరింగ్,డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు
బీటెక్ విద్యార్థులకు 200 పోస్టులు

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌(Vizag Steel Plant)లో 250 అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులకు ఆహ్వానం పలికారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లేదా వారు అందించిన గూగుల్ ఫామ్ లింక్ ద్వారా ఈ నెల 31 వరకు దరఖాస్తుకు గడువు విధించారు.

250 మందిని తీసుకోనున్న ఈ పోస్టులకు ఇంజినీరింగ్ లేదా డిప్లోమా పూర్తి చేసిన అభ్యర్థులను అర్హులుగా ప్రకటించారు.ఈ అప్రెంటిషిప్ శిక్షణ 1 సంవత్సరం పాటు ఇవ్వనున్నారు.

బీటెక్ విద్యార్థులకు 200 పోస్టులు కేటాయించగా, డిప్లొమా అభ్యర్థులకు ౫౦ పోస్టులు కేటాయించారు. అభ్యర్థులు పోర్టల్‌లో రిజస్టర్ చేసుకోవడం తప్పనిసరని వెల్లడించారు.

విద్యార్హతలు..

* గుర్తింపు పొందిన కాలేజీల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు

* రాష్ట్ర ప్రభుత్వం లేదా సాంకేతిక విద్య బోర్డ్ ద్వారా గుర్తింపు పొందిన డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులుగా ప్రకటించింది.

స్టైఫండ్..

ఎంపికైన అభ్యర్థులకు ఇంజినీరింగ్ అభ్యర్థులకు రూ.9000 స్టైంఫడ్ ఇవ్వనుండగా, డిప్లొమా వారికి రూ.8000 స్టైఫండ్ అందించనున్నారు. అభ్యర్థులను వారి వారి కోర్సుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా, రిజర్వేను అనుసరించి ఎంపిక చేయనున్నారు.

ఇలా అప్లై చేస్కోండి..

అధికారిక వెబ్‌సైట్‌లో RINL అప్లై చేసే విద్యార్థులు అంతకు ముందే NATS వెబ్‌సైట్‌ www.mhrdnats.gov.in లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. అందులో ఎన్రోల్ చేసుకున్న అభ్యర్థులు తమ ఎన్రోల్‌మెంట్ నంబర్ లేదా రిజిస్టర్డ్ నంబర్ ద్వారా గూగుల్ ఫాం లింక్ లో వివరాలు నింపి అప్లై చేసుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story