Vizag Steel Plant 2021 Jobs: బీటెక్ లేదా డిప్లొమా అర్హతతో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు..

Vizag Steel Plant 2021 Jobs: బీటెక్ లేదా డిప్లొమా అర్హతతో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు..
Vizag Steel Plant : చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్లు ఈనెల 18 వరకు అందుబాటులో ఉంటాయి. బీటెక్ లేదా డిప్లొమా చేసినవారు అర్హులు.

Vizag Steel Plant Jobs: రాష్ట్రీయ ఇస్సాత్ నిగం లిమిటెడ్ (RINL) పరిధిలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్లు ఈనెల 18 వరకు అందుబాటులో ఉంటాయి. బీటెక్ లేదా డిప్లొమా చేసినవారు అర్హులు. అభ్యర్ధులు పూర్తి వివరాలకు https://www.vizagsteel.com/ వెబ్‌సైట్ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 150

ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 110, టెక్నీషియన్ అప్రెంటీస్ 40 ఉన్నాయి.

అర్హత: మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్ బ్రాంచీల్లో ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక

దరఖాస్తు విధాంన: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 11, 2021

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 18, 2021

వెబ్‌సైట్: https://www.vizagsteel.com/

Tags

Read MoreRead Less
Next Story