Walk-In Interview : గద్వాలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ

X
By - Manikanta |24 Oct 2024 5:15 PM IST
జిల్లా ఆసుపత్రి, సిహెచ్ సి అలంపూర్ లలో వైద్యాధికారుల నియామకానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఆసుపత్రి జోగులాంబ గద్వాల, సి హెచ్ సి అలంపూర్‌లో సి ఏ ఎస్ (ఎస్ పి ఎల్) జనరల్ మెడిసిన్(3), సిఏఎస్ (ఎస్ పిఎల్) జనరల్ సర్జన్(2), సి ఏ ఎస్ (ఎస్ పి ఎల్) గైనకోలోజిస్ట్(4), సిఏఎస్ (ఎస్ పిఎల్) అనస్థేషియా(2), అలంపూర్‌లో జీడిఎంఓ(2) పోస్టుల భర్తీ కొరకు వాక్-ఇన్- ఇంటర్వ్యూ నిర్వహించబడుతుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 25 నుంచి 26 వరకు రెండు రోజుల పాటు నిర్వహించబడే ఈ ఇంటర్వ్యూలో పొల్గొనలన్నారు. ఎంపిక ప్రక్రియ గద్వాల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్‌లో జరుగుతుందని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com