ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బానిసగా మారింది :కిషన్ రెడ్డి

ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బానిసగా మారింది :కిషన్ రెడ్డి

తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బానిసగా మారిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన. రాష్ట్రంలో అన్ని రంగాల్లో అవినీతి పెరిపోయిందన్నా. ప్రజలు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. తెలంగాణ దగా పడ్డ తెలంగాణగా మారిపోయిందన్నారు. ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ధరణి మాఫియా,సాండ్ మాఫియా, దళితబంధులో మాఫియా, కాంట్రాక్టుల్లో మాఫియా, ఎక్కడ చూసినా మాఫియానే అని ఆరోపించారు. భూ దందా కోసమే 111జీవో రద్దు చేశారని ఆరోపించారు. బంగారు తెలంగాణ కాలే కానీ..బంగారు కుటుంబాలు అయ్యాయని అన్నారు.

రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు. అప్పుల కోసమా తెలంగాణ తెచ్చుకుందని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. అప్పులు చేసి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వడ్డీలు కట్టడానికి రాష్ట్ర ఆదాయం సరిపోతుందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పులు చేసిందని చెప్పారు. బ్యాంకుల నుంచే లక్షా 30 వేల కోట్ల అప్పు తీసుకుందన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు.

ఏ ఒక్కరితోనే తెలంగాణ ఆవిర్భవించలేదని..అందరూ పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆ నాడు జేఏసీలో ఉన్నటువంటి ఏకైక జాతీయ పార్టీ బీజేపీ అని అన్నారు. పార్లమెంట్ లో రాష్ట్ర బిల్లు పాస్ చేయడంలో ప్రతిపక్ష పార్టీగా బీజేపీ పాత్ర పోషించిందన్నారు.

Tags

Next Story