KTR: పట్టణ ప్రగతి కోసం ఇప్పటికి 2వేల 959 కోట్లు ఖర్చు..

KTR (tv5news.in)
KTR: పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్త మున్సిపల్ చట్టం- 2019, పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాల రూపురేఖలు మారిపోయాయని చెప్పారు. మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి ప్రారంభమైన నాటి పట్టణ స్థానిక సంస్థలకు 2వేల 959 కోట్లు విడుదల చేశామని వివరించారు.
పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు, ఎల్‌ఈడీ వీధి దీపాలు, వైకుంఠ దామాలు, పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటుచేస్తున్నామని, అర్బన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందిస్తున్నామని చెప్పారు. కేంద్రప్రభుత్వం నిర్వహించిన శానిటేషన్ చాలెంజ్‌లో తెలంగాణకు 12 అవార్డులు వచ్చాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. పట్టణాభివృద్ధిశాఖ కృషికి లభించిన గుర్తింపుగా పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com