తారకరత్న మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం

తారకరత్న మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం

తారకరత్న అకాల మృతి ఆయన కుటుంబసభ్యులను, అభిమానులను కలిచివేసింది. రేపు ఉదయం తారకరత్న పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో ఉంచనున్నారు. రేపు ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

నందమూరి తారకరత్న మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేసారు. 'నందమూరి తారకరత్న అకాల మరణం బాధాకరం. చలనచిత్రాలు వినోద ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి.. ఓం శాంతి' అంటూ మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Tags

Next Story