Puligutta : మైనింగ్‌ ఆపాలంటూ గ్రామస్తులు ఆందోళన

Puligutta : మైనింగ్‌ ఆపాలంటూ గ్రామస్తులు ఆందోళన

వనపర్తి జిల్లా కోత్తకోట మండలం పులిగుట్ట వద్ద ఉద్రిక్తత నెలకొంది. పులిగుట్ట మైనింగ్‌ ఆపాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మైనింగ్‌ కంపెనీ కంటైనర్‌కు నిప్పు పెట్టారు. అక్కడి వాహనాల అద్ధాలు ధ్వంసం చేశారు. మైనింగ్ వల్ల ఎనుగొండ రిజర్వాయర్, మోడల్ స్కూల్, సబ్ స్టేషన్ ప్రమాదంలో పడుతుందని ఆరోపించారు. ఇక గడువు ముగిసిన అధికారులతో కుమ్మక్కై మైనింగ్‌ కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

అధికారుల తీరుకు నిరసనగా పులిగుట్ట దగ్గర బైటాయించి నిరసన తెలిపారు. కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇక రెవెన్యూ అధికారుల హామీతో గ్రామస్తులు వెనక్కి తగ్గారు. మూడు రోజుల్లో సమస్య పరిష్కరించాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story