పెరులో విధ్వంసం సృష్టించిన యాకు తుఫాను
పెరులో 'యాకు' తుఫాను సృష్టించిన విధ్వంసానికి స్థానికుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇటీవల పెరు దేశంలో వచ్చిన 'యాకు' తుఫాను అత్యంత శక్తివంతమైనదని అధికారులు తెలిపారు. ఈ తుఫానులో ఇల్లు, కార్లు అనే తేడా లేకుండా అన్ని బురదలో కూరుకుపోయాయి. మీడియాతో తన బాధను పంచుకున్న ఓ వ్యక్తి... తన ఇంట్లో నడుము వరకు బురదతో కూరుకుపోయిందని, తినడాని భోజనం,కూర్చోడానికి కాస్త చోటుకూడా లేకుండా పోయిందని తెలిపారు. తుఫాను ప్రభావం నుంచి ఉపశమనం పొందేందుకు 400 జిల్లాల్లో అధ్యక్షుడు డినా బోలువార్టే ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ (INDECI) ప్రకారం వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 60 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. "ఇది విచారకరం. కుటుంబాలు బురదలో చిక్కుకున్నాయి, వరి పంటలు ముంపునకు గురయ్యాయి " అని బోలువార్టే తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com