కర్ణాటకలో జోరందుకున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

కర్నాటకలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది.. అధికార, ప్రధాన ప్రతిపక్షాల మధ్య హామీల వర్షం పోటా పోటీగా కురుస్తోంది.. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పలు జిల్లాల్లో పర్యటించారు. ఆయన పర్యటనలో సందర్భంగా ప్రజల నుంచి భారీ స్పందన లభించడంతో నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పలు నియోజకవర్గాల్లో హస్తం నేతలు భారీ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం కోలార్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఏఐసీసీ ప్రసిడెంట్ మల్లికార్జున ఖర్గే, మాజీ సీఎం సిద్దరామయ్య, ముఖ్యనేతలు పాల్గొన్నారు.
కోలార్ సభలో రాహూల్ గాంధీ ప్రసంగం ఆద్యంతం కార్యకర్తల్లో కొత్త జోష్ నింపింది. ముఖ్యంగా తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ప్రజలకిచ్చే సదుపాయాల గురించి రాహుల్ వివరించారు. గృహ జ్యోతి పధకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో పాటు గృహలక్ష్మీ యోజన పథకం కింద ప్రతీ కుటుంబలోని మహిళకు 2 వేల రూపాయిలు అందజేనున్నట్లు తెలిపారు. అన్నభాగ్య పథకం కింద కుటుంబంలో ఒక్కొక్కరికీ 10 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు ప్రకటిచారు. ఇక యువనిధి పధకం కింద నిరుద్యోగ భృతిని ప్రకటించారు. ప్రతీ గ్రాడ్యూయేట్ కు అక్షరాలా 3 వేలు, డిప్లమో హోల్డర్స్ కు 15 వందలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దాంతో పాటు అదాని కంపెనీ నుంచి సుమారు వెయ్యి కోట్ల రూపాయిలను నిరుపేద మహిళలకు, నిరుద్యోగ యువకులకు ఆర్ధిక సాయం అందించే అవకాశాన్ని పరిశీలిస్తున్నానని రాహుల్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com