తెలంగాణ సచివాలయంలో... ఏ శాఖలు.. ఎక్కడంటే..!

తెలంగాణ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం ఆయన ఆరవ అంతస్థులోగల తన చాంబర్ లో ఆసీనులయ్యారు. అనంతరం ఆరు ఫైళ్లపై సంతకం చేశారు. వీరి తర్వాత మంత్రులు కూడా తమ చాంబర్ లలో ఆసీనులయ్యారు.
గ్రౌండ్ ఫ్లోర్లో.. రెవెన్యూ, కార్మిక, ఎస్సీ సంక్షేమ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, ఉపాధి కల్పన శాఖలు, మొదటి అంతస్థులో.. హోం , విద్యా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలు, రెండవ అంతస్థులో.. ఆర్థికం, విద్యుత్, వైద్య ఆరోగ్యం, పశు సంవర్ధక శాఖలు, మూడవ అంతస్థులో.. పురపాలక, పట్టణాభివృద్ది, ప్లానింగ్, ఐటీ, వ్యవసాయ, మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, సహకార, పరిశ్రమలు, వాణిజ్య శాఖలు, నాలుగవ అంతస్థులో... బీసీ సంక్షేమ, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక, నీటి పారుదల, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, యువజన, పర్యాటక, న్యాయశాఖలు. ఐదవ అంతస్థులో రవాణా, రహదారులు, సాధారణ పరిపాలన, భవనాల శాఖలు. ఆరవ అంతస్థులో సీఎం కార్యాలయం, సీఎం పేషీ ఉంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com