తెలంగాణ, చత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్, ఇద్దరు మృతి

తెలంగాణ, చత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్, ఇద్దరు మృతి

తెలంగాణ, చత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు LOS దళ కమాండర్‌గా పోలీసులు గుర్తించారు. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో తెలంగాణ గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ బలగాల పోలీసులు చర్ల మండలం పుట్టపాడు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. అదే సమయంలో మావోయిస్టు దళ సభ్యులు ఎదురు కావడంతో.. ఇరు వర్గాలు కాల్పులు జరిపాయి. ఒకే చోట వేర్వేరుగా జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఒక SLR ఆయుధం స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో LOS కమాండర్ ఎర్రయ్య అలియాస్ రాజేష్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Tags

Next Story