మత్స్య సంపదలో తెలంగాణ దేశానికే ఆదర్శం : మంత్రి హరీశ్‌రావు

మత్స్య సంపదలో తెలంగాణ దేశానికే ఆదర్శం : మంత్రి హరీశ్‌రావు

మత్స్య సంపద అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి హరీశ్‌రావు. రైతు ఏడ్చిన రాష్ట్రం ముందుకు పోదంటారు.. మూగజీవాలకు కూడా కేసీఆర్‌ నాయకత్వంలో విస్తృత సేవలు అందుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు పివికి ఘాట్ కట్టడానికి అనుమతి ఇవ్వలేదు.. కానీ తమ ప్రభుత్వం పశు వైద్యశాలకు పివి పేరు పెట్టి వారి గౌరవాన్ని పెంచిందన్నారు. సిద్దిపేటలో పీవీ నర్సింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయానికి మంత్రులు హరీశ్‌రావు, తలసాని శంకుస్థాపన చేశారు.

కమిట్‌మెంట్‌ ఉన్న నాయకత్వం ఉంటే ఏదైనా సాధ్యమేనన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గత పాలకులు రైతులు, మహిళు, గొల్ల కురుమలను విస్మరించాయని చెప్పారు. మత్స్య సొసైటీల్లో మరో లక్ష మందికి కొత్తగా సభ్యత్వం ఇస్తున్నామని.. నెలాఖరులో రెండో విడత గొర్రెల పంపిణీ చేపడుతామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story