150మంది పిల్లలకు ఉచిత విద్యను అందించనున్న రాఘవ లారెన్స్

ప్రముఖ కోరియోగ్రాఫర్, హీరో రాఘవ లారెన్స్ 150మంది పిల్లలకు ఉచితంగా విద్యను అందజేస్తున్నారు. ఈ విషయాన్ని రుద్రుడు ఆడియో లాంచ్ లో ప్రకటించారు. "ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 150 మంది పిల్లలకు మంచి విద్యను అందించబోతున్నాను. నాకు మీ అందరి ఆశీస్సులు కావాలి" అని రాఘవ లారెన్స్ ట్వీట్ చేశారు. లారెన్స్ ఆద్యాత్మికంగా, సాంఘిక పరంగాను తన సేవలను అందించడంలో ముందుంటారు. గతంలో కూడా చాలా మందికి ఉచిత ఆపరేషన్లను చేయించారు. వారి తల్లి కోరక మేరకు రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించారు. లారెన్స్ చిన్నారుల పట్ల చూయిస్తున్న శ్రద్దకు నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు. ఆయన తాజాగా నటించిన రుద్రుడు సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినామాకు కతిరేసన్ దర్శకత్వం వహించారు. లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘రుద్రుడు' తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com