టీవీ5 ఎఫెక్ట్ ... కోడూరు గ్రామానికి మంచినీరు

అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలోని సముద్ర తీర గ్రామాల్లో, పేదల దాహార్తిని టీవీ5 వెలుగులోకి తెచ్చింది. టీవీ5 కథనంతో ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు ఇరాలి పరిసర గ్రామాలకు వెళ్లి ఒకే రోజు ఐదు గంటలు తాగు నీరు ఇచ్చారు. ఈ నేపధ్యంలో వైసీపీ నేతలు ఇక్కడ తాగు నీరు సమస్యే లేదంటూ, టీవీ5 కథనాలపై విమర్శలు చేసారు.తాగునీరు సమస్యలపై వైసీపీ రాజకీయంగా స్పందించి, అసలు సమస్యే లేదంటూ బుకాయించిన నేపథ్యంలో, తీర గ్రామాల్లో త్రాగునీరు సమస్యపై మాజీ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ స్పందించారు.
ఇరాలి, బసవవానిపాలెం, రామకృష్ణపురం గ్రామాల్లో తాగు నీటి సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామ మహిళలు తాగునీటి సమస్య చెప్పుకుని గొల్లు మన్నారు. కుళాయిల్లో మట్టి కలిపిన నీరు వస్తుందని, మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు. వర్షపు నీరు పట్టుకుని తాగుతున్నామన్నారు వాపోయారు. ఇంటింటికి కుళాయిలు వేసినా, ఆ నీళ్లు తాగడానికి పనికి రావడం లేదన్నారు. టీవీ5కు చెప్పినందుకు అధికారులు బెదిరిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు.
కుళాయిలు సక్రమంగా వేయకుండా, లోతట్టుగా వేసారన్నారు మహిళలు. కుళాయిలు సక్రమంగా వేయాలని డిమాండ్ చేసారు బుద్ధప్రసాద్. తీర ప్రాంతాలకు ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాలని సూచించారు. వారం రోజుల్లో తాగు నీటి సమస్య పరిష్కరించక పోతే, టీడీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపతామన్నారు మండలి బుద్ధప్రసాద్. తీర ప్రాంతాలను వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో ఒక్క అభివృద్ధి కూడా చేయలేదన్నారు. సముద్రం పక్కన ఉండే గ్రామాలకు రక్షణ కరకట్టగా, తాము లారీలు తిరిగేలా నిర్వహిస్తే, వైసీపీ ప్రభుత్వం కాలిబాటగా మార్చిందని విమర్శించారు బుద్థప్రసాద్. తుఫాన్లు వస్తే ఈ గ్రామాల పరిస్థితి ఎంటని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో మూడు వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వలేని వైసీపీ ప్రభుత్వం, తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు మండలి బుద్ధప్రసాద్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com