నీట్, జేఈఈ వాయిదా కోరుతూ సుప్రీం కోర్టుకు ఏడు రాష్ట్రాలు సీఎంలు

నీట్, జేఈఈ వాయిదా కోరుతూ సుప్రీం కోర్టుకు ఏడు రాష్ట్రాలు సీఎంలు
నీట్, జేఈఈ పరీక్షల నిర్వాహణ వాయిదా వేయాలని కోరుతూ ఏడు రాష్ట్రాల సీఎంలు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు.

నీట్, జేఈఈ పరీక్షల నిర్వాహణ వాయిదా వేయాలని కోరుతూ ఏడు రాష్ట్రాల సీఎంలు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియా గాంధీ నిర్వహించిన వీడియో కాన్పెరెన్స్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా సమయంలో నీట్, జేఈఈ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడంపై చర్చ జరిగింది. ఓ వైపు కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుంటే.. ప్రభుత్వం మరోవైపు జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించడానికి ప్రయత్నాలు చేయడాన్ని తప్పుపట్టారు. ఈ విషయంలో కలిసి కట్టుగా సుప్రీం కోర్టును సంప్రదించి జేఈఈ, నీట్ పరీక్షల వాయిదా కోసం కృషి చేయాలని మమత బెనర్జీ ప్రతిపాదించారు. ఈ సమయం పరీక్షలు నిర్వహించడం ఏమాత్రం సమంజసం కాదన అన్నారు. కరోనా సమయం కావడంతో రవాణా సదుపాయలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయని.. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల పాలవుతారని అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పాల్గొన్నారు. అయితే కేంద్రం మాత్రం షెడ్యూలు ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని చెప్తోంది. పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ ఓ పిటిషన్‌ను దాఖలు కాగా.. గత వారం సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో, పరీక్షల నిర్వహణకు కేంద్రం సిద్ధమవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story