షాకింగ్.. అసెంచర్ లో 25వేల ఉద్యోగాలు అవుట్

షాకింగ్.. అసెంచర్ లో 25వేల ఉద్యోగాలు అవుట్
టెక్ కంపెనీ అసెంచుర్ 25వేల మందికి ఉద్వాసన పలకనున్నట్టు ప్రకటించింది.

అమెరికాకు చెందిన అతిపెద్ద గ్లోబల్ టెక్ కంపెనీ అసెంచుర్ 25వేల మందికి ఉద్వాసన పలకనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీలో 5లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారు.ఇందులో 5శాతం మందిని తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. అయితే పనితీరు ఆధారంగానే లే ఆఫ్ ఉంటుందని కంపెనీ వర్గాలంటున్నాయి. కోవిడ్ కారణంగా తగ్గిన ఆర్డర్లు, పడిపోతున్న ఆదాయం నేపథ్యంలో కాస్ట్ కటింగ్ పై ద్రుష్టి సారించింది అసెంచుర్. తాజా నిర్ణయంతో భారత్ లోని కంపెనీ ఉద్యోగులపై ఎఫెక్ట్ ఉంటుంది. అత్యధికంగా ఇండియాలోనే కంపెనీకి ఉద్యోగులున్నారు. మనదేశంలోనే 2లక్షల మంది కంపెనీలో పనిచేస్తున్నారు. 120 దేశాల్లో దాదాపు 5లక్షల 9వేల మంది ఉద్యోగులున్నారు. కంపెనీ ఆదాయం 1.3శాతం పడిపోయింది. దీంతో లేఆఫ్ ప్రయత్నాల్లో ఉంది. అయితే ఇది లేఆఫ్ కాదని.. సహజంగా పనితీరు ఆధారంగా జరిగే ప్రక్రియే అంటున్నారు. ఇటీవల కంపెనీలో పనితీరు ఆధారంగా ప్రమోషన్లు ఇచ్చినట్టు చెబుతోంది.

Tags

Read MoreRead Less
Next Story