Accident : కాకినాడ తాళ్లరేవు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం

Accident : కాకినాడ తాళ్లరేవు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
X

కాకినాడ జిల్లా తాళ్లరేవు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఓ ప్రైవేటు బస్సు ఆటోను ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి.. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.. కాకినాడ జీజీహెచ్‌లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.. బాధితులు రొయ్యల పరిశ్రమలో పనిచేసే కార్మికులుగా గుర్తించారు. రొయ్యల సీడ్‌ పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.. ప్రమాదానికి గురైన వారంతా యానాంలోని నీలపల్లికి చెందిన మహిళలుగా గుర్తించారు. తాళ్లరేవు మండలం సీతారామపురం సుబ్బరాయుని దిబ్బ వద్ద ప్రమాదం జరిగింది.. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అతివేగమే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు.. ఇద్దరు మహిళలు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. స్వల్ప గాయాలైన వారికి తాళ్లరేవులో చికిత్స అందించారు.

Next Story