Andhra Pradesh: జగన్ ప్రభుత్వంపై కర్ణాటక ప్రభావం

Andhra Pradesh: జగన్ ప్రభుత్వంపై కర్ణాటక ప్రభావం
ఏపీలో జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆరోపణలే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఎదుర్కొంది.దీంతో కర్ణాటక ప్రజలు బీజేపీని తిరస్కరించాయి

కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభుత్వం జగన్ ప్రభుత్వంపై కనిపిస్తోంది. ఏపీలో జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆరోపణలే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఎదుర్కొంది.దీంతో కర్ణాటక ప్రజలు బీజేపీని తిరస్కరించాయి. కాంగ్రెస్ కు జై కొట్టాయి. ఇప్పుడు అక్కడి ఫలితాల వణుకు వైసీపీ సర్కార్‌లో కనిపిస్తోంది. కర్ణాటకలో 40 శాతం కమిషన్ నినాదం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం పైన క్షేత్ర స్థాయి ప్రజల్లో ఇదే రకమైన అభిప్రాయం కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వంలో విచ్చలవిడి అవినీతితో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అదే దక్షిణాదిన ఉన్న ఏకైక బీజేపీ ప్రభుత్వ పతనానికి కారణమైంది.ఏపీలో నూ ఇదే తరహా పరిస్థితి నెలకొందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ ముఖ్యనేతలు కూడా ఆఫ్ ద రికార్డ్ చిట్‌ చాట్‌లో అంగీకరిస్తున్నారని సమాచారం. రాష్ట్రంలో ఏడాదిలోపే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో జగన్‌ సర్కారుపై జనంలో వ్యతిరేకత ప్రబలిపోయింది.

ఇక ఏపీలో జగన్ సర్కార్‌..బీజేపీ మధ్య రాజకీయ బంధాన్ని తెలుగు ప్రజలు స్వాగతించడం లేదని అర్దం అవుతోంది. ఏపీకి బీజేపీ ఏం చేయలేదనే ఆగ్రహంతో తెలుగు ప్రజలు ఉన్నా కేంద్రంతో జగన్ సన్నిహితంగా కొనసాగటం తెలుగు ప్రజలకు రుచించటం లేదు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోయినా.. అంచనా వ్యయాన్ని కేంద్రం ఆమోదించక పోయినా సీఎం వైఖరిలో మార్పు లేదు.తన స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో 40 శాతం కమిషన్ ప్రచారం కాంగ్రెస్ కు కలిసొచ్చింది. ఏపీలో దీనికి పోలిక ఉంది. కర్ణాటక తరహాలోనే రాష్ట్రంలోనూ అవినీతి పెరిగిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న కాంట్రాక్టు పనులు చేసిన వైసీపీ నేతల నుంచే పర్సంటేజీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లు కమీషన్లు ఇవ్వకపోవడంతోనే వారికి బిల్లులు ఆపేస్తున్నారని అంటున్నారు. వైసీపీ సొంత సర్వేల్లోనే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని తెలుస్తోంది.

మరోవైపు పచ్చగా కనిపించిన కొండలు ఇప్పుడు కరిగిపోయాయి. నదీ తీర ప్రాంతాల్లో లోతుగా మట్టి..ఇసుక తవ్వకాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ వైసీపీ నేతలు అక్రమంగా తవ్వేస్తున్నవేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయినా సర్కారు స్పందించడం లేదు.ఎవరైనా ఫిర్యాదుచేస్తే.. వారిపైనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.వెంటనే అరెస్టులూ జరిగి పోతున్నాయి. సంక్షే మ పథకాలు అమలు చేస్తున్నామని.. అవినీతికి, లంచానికి తావులేకుండా బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు వేస్తున్నామంటూ సీఎం రోజూ చెబుతున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రతి పనికీ లంచం చెల్లించాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు.

మరోవైపు రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై దౌర్జన్యకాండ ఓ రేంజ్‌లో ఉంటుంది. అక్రమ కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం లాంటివి నిత్యకృత్యంగా మారాయి. సీఎం జిల్లా పర్యటనలు ఉంటే వారం ముందు నుంచే షాపులు మూయించడం లాంటి ఘటనలను చూసి ప్రజలు ప్రభుత్వంపై మండి పడుతున్నారు. పాలనపై పట్టు లేని సీఎంతో రాష్ట్రాభివృద్ధి మాట అటుంచుతే ఉన్న వనరులు తరిగిపోతున్నాయని.. భావి తరాల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందన్న భావన ప్రజల్లో ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న దాష్టీకాలను చూస్తుంటే అసలు శాంతిభద్రతలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. తమ దగ్గరకు వస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ప్రభుత్వం పైన,నాయకత్వంపైనా నమ్మకం ఉంటే తమంత తాముగా ఇంటికి జగన్‌ స్టిక్కరును అతికించుకోవాలి. కానీ వైసీపీ నేతలు భయపెట్టి, బెదిరించి పోలీసుల సహకారంతో జగనన్నే మా భవిష్యత్తు అంటూ స్టిక్కర్లు అతికిస్తున్నారు.దీనిపైన కూడా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story