AP : యువగళంలో దూకుడును ప్రదర్శిస్తోన్న లోకేష్

AP : యువగళంలో దూకుడును ప్రదర్శిస్తోన్న లోకేష్
X

నారా లోకేష్‌ .. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం. యువగళం పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాలను క్రమంగా తన వైపు తిప్పుకుంటున్న యూత్‌ లీడర్‌. తాజా పరిణామాలను ఆకళింపు చేసుకుంటూ... మాస్‌తో పాటు క్లాస్‌ను ఆకట్టుకుంటున్న నాయకుడు. స్పాంటేనియస్‌ నిర్ణయాలు, అధికార పక్షంపై చెలరేగే తీరు, ప్రత్యర్ధులు ఇరుకున పడేలా చేస్తున్న సవాళ్లు... ఆయన పరిణతిలో మార్పనకు సంకేతాలు..! ఒకప్పడు సాత్విక లోకేష్‌... ఇప్పుడు మాత్రం దూకుడు లోకేష్‌ అంటూ జనం చర్చించుకుంటున్నారు. తిరుపతిలో జరిగిన హలో లోకేష్‌ కార్యక్రమంతో... ఇది మరింత సుస్పష్టం. ఈ కార్యక్రమంతో.. తన విజన్‌ ఏంటో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజానీకానికి సూటిగా.. నిక్కచ్చిగా వివరించి అందరి ప్రశంసలు పొందుతున్నారు లోకేష్‌.


యువగళం పాదయాత్రలో భాగంగా తిరుపతిలో కొత్త కాన్సెప్ట్‌ను డిజైన్‌ చేశారు. హలో లోకేష్.. ఈ కార్యక్రమాన్ని ఏపీ రాజకీయాలకు తొలిసారి పరిచయం చేశారు లోకేష్‌. ఇందులో యువతను భాగం చేశారు. అయితే... దీనికి పెద్ద ఎత్తున ప్రచారం మాత్రం చేయలేదు. దీంతో ఇది మామూలు బహిరంగసభే అనుకున్నారంతా! ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించి.... ఏవో నాలుగు హామీలిచ్చి వెళ్లిపోయే రొటీన్ సభ అనుకున్నారు! కానీ దీనికి పూర్తిగా భిన్నంగా ఈ కార్యక్రమం జరిగింది. లోకేష్‌ ఎంట్రీనే అదుర్స్‌. యువకుల మధ్యలోకి వెళ్లి... అభివాదం చేస్తూ...అందరిని ఆకట్టుకున్నారు లోకేష్‌.


యువత అనుమానాలు.. సందేహాలను లోకేష్‌ స్వయంగా నివృత్తి చేసిన కార్యక్రమం ఇది. ఓ నాయకుడిగా... లోకేష్‌ తన విజన్‌ను ప్రజల ముందు పెట్టేందుకు పక్కా ఏర్పాటిది. అంతకుమించి ఓ లీడర్‌ ఎలా ఉండాలో, ఉంటారో ప్రపంచానికి చాటిచెప్పిన కాన్సెప్ట్ ఇది. ఈ కార్యక్రమంలో లోకేష్‌ ఇచ్చిన ఆన్సర్లు .. ఆయనలో ఉన్న క్లారిటీని ప్రజల ముందు ఉంచింది. యువత అడిగిన ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానం ఇచ్చారు లోకేష్‌. ఏ ప్రశ్నలు వేయాలన్నది ముందుగా డిసైడ్ చేయలేదు. ఎలాంటి ప్రశ్నలైనా ఎదుర్కొనేందుకు సిద్ధమైన లోకేష్‌... ఈ కార్యక్రమాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించడంపై రాజకీయ పండితులు.... సైతం కొనియాడుతున్నారు. ఇందులో లోకేష్‌ విజన్‌ ఎంటో స్పష్టమైందంటున్నారు.


హలో లోకేష్‌ కార్యక్రమంలో..... రాష్ట్ర రాజకీయాలతో పాటు.. అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి, నిధులు, విధులపై యువత అడిగిన అన్ని ప్రశ్నలకూ స్పష్టమైన సమాధానాలిచ్చారు లోకేష్. తన విజన్ ను ఆవిష్కరించారు. ఓ నాయకుడిగా తనకు ఎలాంటి పరిణతి ఉందో... ఈ కార్యక్రమం ద్వారా స్పష్టం చేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో ప్రజల ముందుంచారు. పేదరికం లేని రాష్ట్రం రూపొందాలంటే ఒక్కో జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేయాలని అభిప్రాయపడ్డారు. సంక్షేమంతోపాటు అభివృద్ధి అవసరమన్నారు. అర్హులందరికీ ఉద్యోగం కల్పించడమే జగన్‌కు ఇచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌ అన్నారు.


ఈ కార్యక్రమంలో యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లోకేష్‌పై ప్రశ్నలు సంధించారు. ఎలాంటి బెరుకు లేకుండా... స్పష్టంగా, సూటిగా సమాధానమిచ్చారు లోకేష్‌. గతంలో ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఏ నాయకుడు చేయలేదు. మొత్తానికి హలో లోకేష్‌ కాన్సెప్ట్‌ సక్సెస్‌పుల్‌ అయింది. సోషల్ మీడియాలోనూ దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. హలో లోకేష్‌ కార్యక్రమంతో... జగన్‌ సర్కారుకు నిద్రపట్టడం లేదనే టాక్‌ వినిపిస్తోంది. డ్రోన్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని సైతం చిత్రీకరించింది. వేదిక సమీపంలో ఓ డ్రోన్‌ను టీడీపీ నేతలు గుర్తించారు. పోలీసుల సూచనల మేరకే డ్రోన్‌ వీడియో తీసినట్లు తెలుస్తోంది. అటు... ఇంటెలిజెన్స్‌ పోలీసులు సైతం... ఈ కార్యక్రమం గురించి ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి హలో లోకేష్‌ కార్యక్రమం సక్సెస్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు.

Next Story