AP : తిరుపతి పవిత్రతను వైసీపీ నాశనం చేసింది : బోండ ఉమ

AP : తిరుపతి పవిత్రతను వైసీపీ నాశనం చేసింది : బోండ ఉమ
X

తిరుపతి పవిత్రతను వైసీపీ నాశనం చేసిందని ఆరోపించారు టీడీపీ సీనియర్‌ నేత బోండా ఉమ. గంజాయి గుప్పుగుప్పుమంటోందని.. సారాయి ఏరులై పారుతుందన్నారు. దీంతో తిరుపతి ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. వైసీపీ దుర్మార్గ పాలన నుంచి TTDని కాపాడుకోవడానికి ఉద్యోగులు సన్నద్ధం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఓటమి భయంతోనే జగన్‌ టీడీపీ ఆఫీస్‌లపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

ఇటు యువగళం పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. 27వ రోజు తిరుపతి జిల్లాలో యువగళం జోష్ నెలకొంది. లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో తిరుపతి నగరం జనసంద్రంగా మారింది. యువనేతకు స్వాగతం పలికేందుకు వేలాది మంది తరలివస్తున్నారు. పాదయాత్రలో టీడీపీ అగ్రనేత వెంట అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు లోకేష్.

Next Story