AP : పిఠాపురం మున్సిపాల్టిలో అవినీతి వ్యవహారం

AP : పిఠాపురం మున్సిపాల్టిలో అవినీతి వ్యవహారం
X

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాల్టిలో అవినీతి వ్యవహారం రచ్చకెక్కింది. కౌన్సిల్‌ సమావేశం సాక్షిగా మున్సిపల్‌ డీఈ భవానీ శంకర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పట్టణంలో పాత స్క్రాబ్‌ వేలం పాట వ్యవహారం ఎవరిని అడిగి చేశారని, ఇందులో అధికారులు ఎంత తీసుకున్నారంటూ నిలదీశారు కౌన్సిలర్లు . దీంతో ఆగ్రహించిన డీఈ భవాని శంకర్‌, ఎవరు ఎంత తీసుకున్నారో త్వరలో తేలుస్తానన్నారు. ఒక వ్యక్తికి తానే స్వయంగా 65 వేలు ఇచ్చానన్నారు. దీంతో డబ్బులు తీసుకున్న వ్యక్తి పేరు చెప్పాలంటూ వైసీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు.

ఈ సమయంలో డీఈకి వైసీపీ కౌన్సిలర్లు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. ఎవరికి డబ్బులు ఇచ్చారో తేల్చాలని కౌన్సిలర్లు. పట్టుపట్టడంతో.. కోపోద్రిక్తుడైన డీఈ...... అందరి జాతకాలు బయటికొస్తాయని హెచ్చరించారు. ఉద్యోగులంటే ఆషామాషీగా ఉందా? భయపెట్టాలని చూస్తారా? ఇక్కడెవరూ భయపడేది లేదన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛైర్మన్‌ ఛాంబర్‌లోకి వస్తే ఎవరికి ఎంతిచ్చానో చెబుతానంటూ.. తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో... వైసీపీ కౌన్సిలర్లు కంగుతున్నారు.

Next Story