AP : ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌కు నిరసన సెగ

AP : ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌కు నిరసన సెగ
X

కృష్ణా జిల్లా పామర్రు వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌కు నిరసన సెగ తగిలింది. తమ సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదంటూ సురసానిపల్లె హరిజనవాడ మహిళలు నడి రోడ్డుపై ఎమ్మెల్యేను నిలదీశారు. మొవ్వ గ్రామానికి ఎమ్మెల్యే వస్తున్నారన్న సమాచారంతో గ్రామస్తులు రెండు ట్రాక్టర్లపై అక్కడికి వెళ్లారు. ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు. గెలిచి నాలుగేళ్లు దాటుతున్నా తమ గ్రామానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఓట్ల కోసం దండాలు పెట్టి తిరిగి.. ఇప్పుడు తమ గ్రామ సమస్యలు పరిష్కరించేందుకు తీరికలేకుండా పోయిందా అని గ్రామస్తులు మండిపడ్డారు. వెంటనే తమ గ్రామంలో రోడ్ల సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Next Story