Assam : మందుతాగే పోలీసులకు స్వంచంద పదవీ విరమణ

Assam : మందుతాగే పోలీసులకు స్వంచంద పదవీ విరమణ
X

అలవాటుగా మద్యం తాగే పోలీసులను స్వచ్చంద పదవీ విరణ చేయాలని కోరింది అస్సాం ప్రభుత్వం. ఇందుకుగాను అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రక్రియను ప్రారంభించారు. మీడియాతో మాట్లాడిన శర్మ సుమారు 300మంది పోలీసు అధికారులు, జవాన్లకు అతిగా మద్యం తాగే అలవాటు అయిందని అన్నారు. ఇప్పటికే వారి శరీరాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ 300మంది స్వచ్చంద పదవీ విరమణ చేయనున్నట్లు ప్రకటించారు. ఖాళీల భర్తీకి కొత్త రిక్రూట్ మెంట్ జరుగుతుందని తెలిపారు.

“సుమారు 300 మంది అధికారులు, జవాన్లు మద్యపానానికి అలవాటు పడ్డారు మరియు అతిగా మద్యం సేవించడం వల్ల వారి శరీరాలు దెబ్బతిన్నాయి. వారి కోసం ప్రభుత్వం స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (VRS)ని ఏర్పాటు చేసింది. ఇది పాత నియమం, కానీ మేము ఇంతకు ముందు దీనిని అమలు చేయలేదు, ”అని శర్మ అన్నారు.

Tags

Next Story