Congress 85th Plenary : ప్రధాని మోదీపై మండిపడ్డ రాహుల్ గాంధీ

'భారత్ జోడో యాత్ర' ద్వారా దేశ ప్రజల్లో త్రివర్ణ పతాక స్పూర్తిని నింపినట్లు తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం మూడవ రోజు రాహుల్ గాంధీ ప్రసంగించారు. తాము దేశ ప్రజల్లో స్పూర్తిని నింపితే, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం జాతీయ స్పూర్తిని ప్రజల్లోనుంచి దూరం చేశారని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో పీఎం మోదీ తాను 1991లో పాల్గొన్న ఏక్తాయాత్ర ను గుర్తుకుతెచ్చుకున్నారు. జమ్మూ, కాశ్మీర్ లోని శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో తన పర్యటనను పార్లమెంట్ లో మాట్లాడారు. ఈ విషయంపైనే రాహుల్ అభ్యంతరం చెప్పారు.
రాహుల్ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర'ను కశ్మీర్ లో ముగించిన విషయం తెలిసిందే. అదే రోజు పీఎం మోదీ కూడా తాను చేపట్టిన ఏక్తాయాత్ర, జమ్మూ కాశ్మీర్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భాన్ని పార్లమెంట్ లో గుర్తుకు చేసుకున్నారు. ఈ విషయంపై రాహుల్ మాట్లాడుతూ.. తాము దేశప్రజల్లో స్పూర్తిని నింపి పతాకాన్ని ఆవిష్కరించామని, మోదీ మాత్రం స్పూర్తిని ప్రజలనుంచి దూరం చేశారని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com