విశాఖ జిల్లాలో కరోనా..

విశాఖ జిల్లాలో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. మంగళవారం కొత్తగా 846 కరోనా కేసులు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 31,973కు చేరింది. కాగా వైరస్ తో మృతి చెందిన వారి సంఖ్య 226కు చేరుకుంది. ఇక విశాఖ జిల్లా వైరస్ కేసులు ఎక్కువగా.. వేపగుంట, పెందుర్తి, ఆరిలోవ, వడ్లపూడి, కూర్మన్నపాలెం, సింహాచలం, మాధవధార, మురళీనగర్ ప్రాంతాలతో పాటు లంకెలపాలెం, భీమిలి, గోపాలపట్నం, శ్రీరామ్ నగర్, దోభీ కాలనీ, నరసింహనగర్, విశాలాక్షి నగర్, సంజీవ్ నగర్, సబ్బవరం, ఆరిపాక, టెక్కలిపాలెం, అనకాపల్లి, కశింకోట, చోడవరం, నర్సీపట్నం, బుచ్చయ్యపేట, రాంబిల్లి, దిమిలి, అచ్చుతాపురం, గొలుగొండ మండలంలోని పాతకృష్ణాదేవిపేట, పాయకారావుపేట మండలం లోని రాజుగారి బీడులో కేసులు నమోదవుతున్నాయి.
కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మూతపడుతున్నాయి. ఒక రిజిస్ట్రేషన్ కోసం నలుగురు వ్యక్తులు రావలసి ఉండడంతో కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాగే మధురవాడ కార్యాలయ సిబ్బందికి కరోనా సోకడంతో వారం రోజుల పాటు మూసివేశారు. తాజాగా సబ్బవరం కార్యాలయ అధికారికి, సిబ్బందికి కరోనా సోకడంతో అక్కడి కార్యాలయాన్ని కూడా మూసివేశారు. చోడవరం కార్యాలయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక సందర్భంలో కరోనాకి గురికాక తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. ఉన్న కొద్ది మంది సిబ్బందితోనే రిజిస్ట్రేషన్ పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com