Dubai : విమానంలో దావత్.. ఆపై అరెస్ట్

Dubai : విమానంలో దావత్.. ఆపై అరెస్ట్
X

గల్ఫ్ నుంచి సంవత్సరం తర్వాత తిరిగి భారత్ కు వస్తున్న కార్మికులు విమానంలో పార్టీచేసుకున్నారు. ఆపై సిబ్బందితో గొడవకు దిగారు. ఈ ఘటన దుబాయ్ - ముంబై విమానంలో జరిగింది. దుబాయ్ నుంచి ముంబై కి వస్తున్న ఇండిగో విమానంలో ఇద్దరు ప్రయాణికులు సిబ్బందిపై దుర్భాషలాడారని ఆరోపిస్తూ అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు గురువారం తెలిపారు. విమానం ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లగా వారికి బెయిల్ మంజూరైందని అధికారులు తెలిపారు.

ఇద్దరు నిందితులు పాల్ఘర్, కొల్హాపూర్ లోని నలసోపరా కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వాళ్లు గల్ఫ్ లో ఒక సంవత్సరం పని చేసి తిరిగి వస్తున్నట్లు తెలిపారు. ఇంటికి తిరిగి వస్తున్న సంతోషంలో డ్యూటీ ఫ్రీ షాప్ నుంచి తెచ్చిన మద్యాన్ని విమానంలో సేవించి సంబరాలు చేసుకోవడం ప్రారంభించారని అధికారులు చెప్పారు. తోటి ప్రయాణికులు అభ్యంతరం చెప్పగా వాగ్వాదం జరిగిందని, జోక్యం చేసుకున్న సిబ్బందిపై కూడా దుర్బాషలాడినట్లు తెలిపారు. విమానంతో నడుస్తూ మద్యం సేవించినట్లు సిబ్బంది చెప్పారు.

నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 336 (ఇతరుల ప్రాణాలకు మరియు భద్రతకు), ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్‌లోని 21,22 మరియు 25 కింద కేసు నమోదు చేసినట్లు సహర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. విమానయాన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏడాది విమాన ప్రయాణికులు వికృతంగా ప్రవర్తించినందుకు కేసు నమోదు చేయడం ఏడో ఘటన అని అన్నారు. మార్చి 11న, ఒక వ్యక్తి లావెటరీలో ధూమపానం చేసి లండన్-ముంబై విమానం యొక్క ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను తెరవడానికి ప్రయత్నించినందుకు అరెస్టు చేయబడ్డాడు.

Next Story