ప‌శ్చిమ‌బెంగాల్‌లో భూకంపం

ప‌శ్చిమ‌బెంగాల్‌లో భూకంపం

ప‌శ్చిమ‌బెంగాల్‌లో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం రెండు వేర్వేరు చోట్ల భూకంపం సంభవించింది. పశ్చిమబెంగాల్ రాష్ర్టంలోని దుర్గాపుర్, బర్హంపూర్‌లో భూమి స్వ‌ల్పంగా కంపించింది. దుర్గాపూర్‌లో బుధవారం ఉద‌యం 7.54 గంట‌ల‌కు భూమి కంపించిందని నేష‌న‌ల్ సీస్మొల‌జీ సెంట‌ర్ (ఎన్ఎస్‌సీ‌) ప్ర‌క‌టించింది.. దీని తీవ్ర‌త రిక్ట‌ర్‌స్కేల్‌పై 4.1గా న‌మోదయ్యింద‌ని ఎన్ఎస్‌సీ తెలిపింది. భూకంప కేంద్రం దుర్గాపూర్‌కు 110 కి.మీ. దూరంలో ఉందని తెలిపింది.

ఇక బుధవారం తెల్ల‌వారుజామున బ‌‌ర్హంపూర్‌కు 30 కి.మీ. దూరంలో భూమి కంపించిందని నేష‌న‌ల్ సీస్మొల‌జీ సెంట‌ర్ (ఎన్ఎస్‌సీ‌) ప్ర‌క‌టించింది. దీని తీవ్ర‌త 3.8గా న‌మోద‌య్యింద‌ని యూరోపియ‌న్ మెడిటేరియ‌న్ సీస్మొల‌జిక‌ల్ సెంట‌ర్ వెల్ల‌డించింది. భూకంపం సుమారు 8 గంట‌ల ప్రాంతంలో వ‌చ్చిన‌ట్లు తెలిపింది. ‌

Tags

Read MoreRead Less
Next Story