Hyderabad : ప్రేమ వ్యవహారం హత్యకు దారితీసింది.!?

Hyderabad : ప్రేమ వ్యవహారం హత్యకు దారితీసింది.!?
X

హైదరాబాద్‌ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదువుతున్న నవీన్‌, హరిహర అనే యువకులు అదే యూనివర్శిటిలో చదువుతున్న ఓ అమ్మాయిని ప్రేమించారు. తాను ప్రేమించిన అమ్మాయి దక్కకుండా పోతుందనే భావించాడు హరిహర.

నవీన్ ను హత్య చేయాలని హరిహర ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. పార్టీ పేరుతో హైదరాబాద్ శివారు ప్రాంతానికి నవీన్‌ను పిలిచి హత్య చేసినట్లు సమాచారం. ఈ నెల 17న నల్లగొండలో నవీన్‌ కనిపించకుండా పోయాడు. ఇప్పుడు అబ్దుల్లాపూర్ మెట్టు ప్రాంతంలోని గుట్టలో నవీన్ మృతదేహం లభ్యమైంది. ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు.

Next Story