కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి

తెలంగాణలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. సామన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ మహమ్మారి ఎవరినీ వదలటం లేదు. భారీ సంఖ్యలో పోలీసులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే వేలాది మంది పోలీసులకు సైతం కరోనా సోకింది. కరోనా కట్టడి కోసం తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులు ఈ మహమ్మారికి బలైపోతున్నారు. తాజాగా కరోనా వైరస్ సోకి జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతిచెందారు.
అడిషనల్ ఎస్పీ దక్షిణ మూర్తికి ఇటీవలే కరోనా సోకిది. దీంతో ఆయన కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయం ఆయన పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ మూర్తి ఆకస్మిక మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com