Karnataka : శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Karnataka : శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ


ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు కర్ణాటకలో పర్యటించనున్నారు. కర్ణాటక బెలగావిలోని శివమొగ్గ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు మోదీ. దీంతో పాటే పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఏడాది కర్ణాటకలో పర్యటించడం ఇది ఐదోసారి. విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం ఎయిర్ పోర్ట్ ను పరిశీలించనున్నారు.

రూ. 450 కోట్లతో శివమొగ్గ విమానాశ్రయాన్ని నిర్మించినట్లు కర్నాటక ప్రభుత్వం తెలిపింది. దీని ప్యాసింజర్ టెర్మినల్ భవనం లోటస్ ఆకారంలో ఉంటుంది. గంటకు 300మంది ప్రయాణికులకు వసతి కల్పింస్తుదని చెప్పారు. శివమొగ్గ విమానాశ్రయంతో పాటు, షికారిపుర - రాణేబెన్నూరు కొత్త రైల్వే లూన్, కోటెగంగూరు రైల్వే కోచింగ్ డిపోలకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

శివమొగ్గ - శికారిపుర - రాఫెబెన్నూరు నిర్మాణం విలువ రూ.990 కోట్లుగా ఉండనుందని అధికారులు తెలిపారు. ఇది బెంగళూరు - ముంబై మెయిన్ లైన్ తో మల్నాడు ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. శివమొగగ నుండి కొత్త రైళ్లను ప్రారంభించేందుకు, బెంగళూరు, మైసూరులె నిర్వహణ సౌకర్యాలను తగ్గించడానికి శివమొగ్గలోని కోటగంగూర రౌల్వే కోచింగ్ డిపోను రూ.100కోట్ల కంటూ ఎక్కువ వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు.

Next Story