కేంద్ర మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్‌కు కరోనా పాజిటివ్

కేంద్ర మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్‌కు కరోనా పాజిటివ్
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రికి కరోనా సోకింది.

దేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. సామన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రికి కరోనా సోకింది. మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఆరోగ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకుని కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చిందని ఆయన తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని క్రిషన్ పాల్ కోరారు.

Tags

Read MoreRead Less
Next Story